- Advertisement -
సైనికుడు, నలుగురు పౌరులు మృతి
బ్యాంకాక్ : థాయిలాండ్, కంబోడియాల మధ్య మళ్ళీ ఘర్షణలు తలెత్తాయి. సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో థాయి సైనికుడు ఒకరు, నలుగురు కంబోడియా పౌరులు మరణించారు. ఎనిమిది మంది థాయి సైనికులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య గల వివాదాస్పద సరిహద్దుపై రేగిన పోరుకు కారణమంటూ ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి దాదాపు 35వేల మందిని ఖాళీ చేయించారు. ఈ వేసవిలో ఇరు దేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన పోరులో 43మంది మరణించారు. ఇరు వైపులా కలిసి దాదాపు మూడు లక్షలమంది నిర్వాసితులయ్యారు.
- Advertisement -



