ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిష్ట
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
పర్యావరణాన్ని పరిరక్షించుకొని కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులను ప్రతిష్టించుకుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ప్రజలకు సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకుని ప్రతిష్టించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనాలతో తయారుచేసిన వినాయకులను ప్రతిష్టించడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు. రసాయనాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడి సమయానికి వర్షాలు పడకపోవడంతో రైతులతోపాటు సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.
రసాయనాలతో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలకు స్వస్తి పలకాలని, మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలని, నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. సాంప్రదాయ బద్దంగా పండుగలను జరుపుకోవాలని, ఐక్యమత్యాన్ని చాటుకోవాలని సూచించారు. పండుగలకు రాజకీయాలతో ముడి పెట్టరాదని అన్నారు. గ్రామాల్లో అందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈర్ష ద్వేషాలు, కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అధిక వర్షాలతో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
రాబోవు రోజుల్లో కాలుష్యాన్ని నివారించడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై మట్టి వినాయకుల ఏర్పాటుకు ప్రజలను ప్రోహిత్సహించడం వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకుల ఏర్పాటుతో భవిష్యత్ తరాల కోసం కాలుష్య రహిత ప్రకృతిని అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతారావు, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బొమ్మగాని భాస్కర్ గౌడ్, నలమాస రమేష్ గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, లావుడియా భాస్కర్ నాయక్, బానోతు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.