పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని అటవీ సమీపంలో ఉన్న గుట్టలను మట్టి వ్యాపారులు మింగేస్తున్నారు. విలువైన మట్టిని విక్రయిస్తూ ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న సంబంధించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని రంగాపురం, లక్ష్మాపూర్, చెంచు పలుగు తండా, చౌటపల్లి, బ్రాహ్మణపల్లి, చందాపూర్, అటవీ సమీపం లో గల గుట్టలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తోవ్వుతూ మట్టిని బహిర్గతంగా పట్ట పగలు జెసిబి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ విక్రయిస్తున్నారు.
సాధారణంగా పట్టా భూమిలో మట్టిని తరలించాలన్న కూడా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. మట్టిని తవ్వే స్థలాన్ని ముందుగా అధికారులు పరిశీలన చేసి అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి అక్రమ మట్టి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



