Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందానం, కడియంకు క్లీన్‌చిట్‌ అవమానకరం

దానం, కడియంకు క్లీన్‌చిట్‌ అవమానకరం

- Advertisement -

– మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం ప్రజా తీర్పునకు అవమానకరమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. స్పీకర్‌ నిర్ణయం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే చర్య, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయడమే అవుతుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో స్పీకర్‌ గౌరవాన్ని తగ్గించుకున్నారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వాడుతున్నారనే వాదన బలపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తున్నదని తెలిపారు. శాసన వ్యవస్థ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారనీ, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

స్పీకర్‌ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు : నిరంజన్‌రెడ్డి
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్‌ రాజ్యాంగం కాదనీ, కాంగ్రెస్‌ రాజ్యాంగమని పేర్కొన్నారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ టికెట్‌ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు, కూతురును కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేయించి కండువా వేసుకుని చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియం శ్రీహరికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -