Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమాక్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

నరేష్‌ అగస్త్య హీరోగా, విపిన్‌ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. రబియా ఖతూన్‌ కథానాయిక. ఈ చిత్రం ఆగస్ట్‌ 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
హీరో నరేష్‌ అగస్త్య మాట్లాడుతూ,’ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిడం ఆనందంగా ఉంది. విపిన్‌ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. జస్టిన్‌ మ్యూజిక్‌లో పనిచేయడం నా డ్రీమ్‌. తనతో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. మోహన్‌ నా మెంటర్‌. చాలా అద్భుతంగా సినిమా తీశారు. హీరో కంటే అందంగా ఉండే కామియో కావాలి. అందుకే వెతికి వెతికి రాజాని పట్టుకున్నారు(నవ్వుతూ). రబియా చాలా అద్భుతంగా నటించింది. వెరీ బ్యూటీఫుల్‌ క్లీన్‌ ఫిలిం ఇది. చాలా మంచి సినిమా. తప్పకుండా చూడండి’ అని అన్నారు. ‘ఈ సినిమాలో పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వెరీ నైస్‌ అండ్‌ క్లీన్‌ ఫ్యామిలీ మూవీ ఇది. మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. మీరందరూ ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మీ సపోర్ట్‌ ఉంటుందని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్‌ ఉమాదేవి కోట చెప్పారు. హీరోయిన్‌ రబియా మాట్లాడుతూ, ‘నా ఫస్ట్‌ డైరెక్టర్‌ ధనుష్‌కి థ్యాంక్యూ. ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ స్థానంలో నిలుచున్నాను. ఇది చాలా మంచి ఎంటర్టైనర్‌’ అని అన్నారు. ‘ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. చాలా ఎఫర్ట్‌ పెట్టాము. అన్ని కుదిరాయని కనిపిస్తుంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆగస్ట్‌ 22న మీ ముందుకు వస్తున్నాము’ అని డైరెక్టర్‌ విపిన్‌ చెప్పారు. యాక్టర్‌ రాజా మాట్లాడుతూ, ‘నిర్మాత ఉమా చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని రూపొందించారు. విపిన్‌ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా క్లియర్‌ విజన్‌ ఉన్న డైరెక్టర్‌. మోహన్‌ కష్ణ మా అందరిని చాలా డిఫరెంట్‌గా చూపించారు’ అని తెలిపారు.
రాధిక శరత్‌కుమార్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్‌, ఆమని, తులసి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మాస్టర్‌ కార్తికేయ, మోహన్‌ రామన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – విపిన్‌, నిర్మాత – ఉమాదేవి కోట, సినిమాటోగ్రాఫర్‌ – మోహన కష్ణ, సంగీతం – జస్టిన్‌ ప్రభాకరన్‌, ఆర్ట్‌ – తోట తరణి, ఎడిటర్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -