మన ఇంట్లో నిత్యం బట్టలను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ పనితీరు బాగుండాలంటే దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ తప్పనిసరి. లేదంటే అది త్వరగా పాడైపోయి, రిపేర్ల పేరిట జేబులకు చిల్లులు పెడుతుంది. అందుకే ఇంట్లోనే వాషింగ్ మెషీన్‌ను సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలో, దాని లైఫ్ ఎలా పెంచుకోవాలో సింపుల్‌గా తెలుసుకుందాం.
వెనిగర్, బేకింగ్ సోడాను కలిపి స్పాంజితో మెషిన్ లోపలి భాగాన్ని రుద్దాలి. తర్వాత కొన్ని వేడినీళ్లు పోసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడివస్త్రాన్ని తీసు కొని బాగా తుడిస్తే మెషిన్ చక్కగా క్లీన్ అవుతుంది.
కొంత వెనిగర్ తీసుకొని డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో వేయాలి. తర్వాత మెషిన్ ఆన్ చేసి స్పిన్ చేయాలి. ఈ సమయంలో వెనిగర్ మెషిన్ లోపలి భాగాన్నంతా నానబెడుతుంది. తర్వాత నీరు పోసి తిప్పితే సరి.
సగం నిమ్మకాయ చెక్కకు కొద్దిగా టూత్‌పేస్ట్ రాయాలి. దాన్ని మెషిన్‌లో వేసి కొన్ని నీళ్లు పోసి ఆన్ చేయాలి. తర్వాత నీళ్లు పోసి క్లీన్ చేయాలి. రెండు వారాలకోసారైనా ఇలా క్లీన్ చేస్తే మంచిది.
లోదుస్తుల్ని అన్నిటితో కలిపి ఉతికితే అందులోని క్రిములు ఇతర బట్టలకు వ్యాపించి, ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే లోదుస్తుల్ని వేరుగా ఉతకాలి. చిన్నపిల్లల దుస్తులు కూడా విడిగా ఉతకాలి.
వాషింగ్ మిషన్ శుభ్రం చేస్తున్నారా?
- Advertisement -
- Advertisement -



