Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వచ్ఛదనం - పచ్చదనమే ఎజెండా

స్వచ్ఛదనం – పచ్చదనమే ఎజెండా

- Advertisement -

పల్లెల్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలు
99 రోజుల్లోనే పలు కార్యక్రమాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్ని శాఖలకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనుంది. ఆరు అంశాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. మొట్టమొదటగా పల్లెపల్లెనా పారిశుధ్యంపై దష్టి పెట్టనుంది. తాగునీరు, చెత్త నిర్వహణ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, రాబోయే వర్షాకాల ముందస్తు పనులపై దష్టి పెట్టే ప్రణాళికను తయారు చేసింది. ఏ రోజుకారోజు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు వీలుగా షెడ్యూలు రూపొందించింది. సుపరిపాలనతో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

షెడ్యూల్‌ ఇదే
1. గ్రామీణ పరిశుభ్రత కార్యక్రమాలు – మార్చి 6 నుంచి మార్చి 15
2. గ్రామాల ఆదాయం పెంపు చర్యలు – మార్చి 16 నుంచి 31 వరకు
3. తాగునీటి సరఫరా -ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు
4. చెత్త తొలగింపు, చెత్త నిర్వహణ – ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు
5. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం – మే 1 నుంచి 15 వరకు
6. వానాకాలానికి ముందస్తు పనులు..ఏర్పాట్లు – మే 16 నుంచి 31 వరకు

గ్రామీణ పరిశుభ్రత కార్యక్రమం
రహదారుల శుభ్రత, కాలువల మురుగు తొలగింపు, పాఠశాలలు, అంగన్వాడీలు, మార్కెట్లు, హాస్టళ్లు, బస్లాండ్లను శుభ్రపరచడం, రహదారుల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో పొదలను తొలగించడం, ఉపయోగంలో లేని బావులను మూసివేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం చల్లడం, ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ శుభ్రపరచడం, అవసరమైన సిబ్బంది, సామగ్రి కోసం ప్రణాళిక తయారు చేయడం, ఖర్చులు గ్రామపంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ఆర్థిక నిధులను వినియోగించడం.

గ్రామాల ఆదాయం పెంపు
సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల అభివద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరాలో చేపట్టే పనులు చేయడం. తాగునీటి సరఫరా ఇబ్బందులు తెలుసుకోవడం, పూర్తిగా పనిచేసేలా చేయడం, ముందస్తు చర్యలు, గ్రామపంచాయతీ నిధులు, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను వినియోగించడం, మార్చి 27 లోపు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం, చేయాల్సిన పనులు, హ్యాండ్‌ పంపుల మరమ్మతులు, సింగిల్‌ ఫేజ్‌, త్రీ ఫేజ్‌ మోటార్‌ పంపుల మరమ్మతులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల మరమ్మతులు, కొత్త ఇండ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులను గ్రామపంచాయతీ స్థాయిలో మున్సిపల్‌ శాఖతో సమన్వయం చేయాలి.

చెత్త సేకరణ.. చెత్త నిర్వహణ
ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం, ప్రతి గ్రామపంచాయతీలో కంపోస్ట్‌ తయారు చేయడం, చెత్త నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ఈ-వేస్ట్‌, బయోమెడికల్‌ వేస్ట్‌, శానిటరీ వేస్ట్‌ను సురక్షితంగా సేకరించి తొలగించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు పూర్తి చేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేయడం, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ నిర్మించడం

ఉపాధి హామీలో చేపట్టేవి
నీటి సంరక్షణ పనులు, వ్యక్తిగత లబ్దిదారుల పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివద్ధి పనులు, వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధం చేయడం. వర్షపు నీటి కాలువల మురుగు తొలగించడం, లోతట్టు ప్రాంతాల్లో మట్టి నింపడం, దోమల నివారణకు మందులు పిచికారీ చేయడం, ఫాగింగ్‌ డ్రై డే కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కలు నాటడం, నరేగా పథకం ద్వారా గుంతలు తవ్వడం, మొక్కలు నాటేందుకు ప్రదేశాలు గుర్తించడం, నాటే మొక్కలను ఎంపిక చేయడం, రోడ్లు, భవనాల సంరక్షణ, గ్రామీణ రోడ్ల మరమ్మతులు, డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ఉన్న రోడ్ల సంరక్షణ, బీటీ రోడ్లను శుభ్ర పరచడం, కిలోమీటర్‌ రాళ్లు, సమాచారం బోర్డులు, సైన్‌ బోర్డులు పునరుద్ధరించడం, భవనాల సంరక్షణ, పైకప్పుల పగుళ్లను సరిచేయడం, ఆయా భవనాల టెర్రస్‌ శుభ్రపరచడం, భవనాలకు పెయింటింగ్‌ చేయడం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -