Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగారం జీపీలో పరిశుభ్రత కార్యక్రమం

గంగారం జీపీలో పరిశుభ్రత కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం సర్పంచ్ బండం శోభరాణి రాంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బండం శోభరాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ గ్రామాన్ని అందంగా ఉంచాలని కోరారు. కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్ ములకళ్ల నగేష్, వార్డు సభ్యులు మహేందర్, సరోజన, పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -