Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీని శుద్ధి చేయండి…ఇండ్లు కూల్చొద్దు

మూసీని శుద్ధి చేయండి…ఇండ్లు కూల్చొద్దు

- Advertisement -

కుల్చాల్సి వస్తే ముందుగా పేదలకు పునరావాసం కల్పించాలి
మూసీ పునరుజ్జీవంపై చర్చలో బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మూసీ ప్రక్షాళనలో భాగంగా శుద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు చెప్పారు. ఈ క్రమంలో పేదల ఇండ్లను కూల్చకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ కూల్చాల్సి వస్తే ముందుగా పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. నది పుట్టుక నుంచి చివరి వరకు సమగ్రంగా శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులకు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. మూసీ నది అంటే కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదన్నారు. ఇది వికార్‌బాద్‌ జిల్లా నుంచి ప్రారంభమై, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ప్రవహించి చివరికి కృష్ణా నదిలో కలుస్తోందని తెలిపారు.

దాదాపు 240 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నది పక్కన వేలాది మంది రైతులు పంటలు పండిస్తున్నారని గుర్తు చేశారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఈ నది నీటితో పండుతున్న పంటలు కూడా విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రైతులు, వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉందని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్టును శుద్ది చేయడం కాకుండా మన భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు మొదట రూ.5,000 కోట్లు అని చెప్పారనీ, కొన్ని రోజుల్లోనే రూ.7,000 కోట్లకు పెంచారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల వ్యయంపై స్పష్టత లేదని విమర్శించారు. 12 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ పెంచాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -