Tuesday, October 14, 2025
E-PAPER
Homeజిల్లాలురైతులకు "తేమ" తిప్పలు

రైతులకు “తేమ” తిప్పలు

- Advertisement -

పంట తేమ 12% మోచర్ ఉండాలని వ్యాపారుల డిమాండ్..
దినమంతా ఆరబెట్టిన రాత్రిపూట చల్లటి మసురుతో మోచర్ 18.5% నమోదు
రాత్రింబవళ్లు పంట కాపలతో కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు..
నవతెలంగాణ – మద్నూర్

పంట కోత తర్వాత సోయా పంటను రైతులు ఆరబెట్టెందుకు మార్కెట్ యార్డులో నాన తండాలు పడుతున్నారు. రోజువారి వాతావరణంలో మార్పులు రావడం ఆరబెట్టడం, మూసివేయడం వంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. సోయా పంట కొనాలంటే పంట తేమ 12 శాతానికి మించకుండా మోచర్ రావాలని వ్యాపారస్తులు అంటున్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే కొనలేని పరిస్థితి ఉన్నందున, పంట తేమ శాతం తగ్గించడానికి రైతులు ఎండలో ఆరబెట్టెందుకు నానా కష్టాలు పడుతున్నారు.

సర్కారు కొనుగోలు లేకపోవడం ప్రయివేట్ కొనుగోలుదారులు పంట తేమశాతం 12 కంటే మించకుండా ఉండాలని నిబంధనలు పెడుతున్నారు. ఆశాతానికైనా రూ.4200కు మించి కొనుగోలు చేయడం లేదని, సర్కారు ధర రూ.5328 ఉన్నప్పటికీ సర్కారు కొనుగోలు లేక, ప్రయివేటు దళారులకే ఆశ్రయించవలసి వస్తుందని రైతులు వాపోయారు. తేమశాతం పరిశీలించగా.. 18.5 గా నమోదు చూపిస్తుందని, మధ్యాహ్నం ఎండిన రాత్రి తేమ చల్లటి వాతావరణానికి ఉదయం చూడగానే తేమశాతం అధికంగా నమోదు అవుతుందని వారు తెలిపారు. రోజువారి పంట రాత్రింబవళ్లు కాపల కాయవలసి వస్తుందని, ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని వారు నవ తెలంగాణతో మాట్లాడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -