నవతెలంగాణ – పెద్దవూర
మండలంలో విద్యార్థులు లేక మూతబడ్డ పాఠశాలలు నేటి నుంచీ తెరిపిస్తామని మండల విద్యాధికారి తరి రాము అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలం లోఎర్రకుంట తండా, జయరాం తండా, బాసోని బావి,కాంసానివారి గూడెం, కేకే తండా, ఎనిమిది తండా, నాయినివాణి కుంట, నాయిని వాణికుంట తండా, రామన్నగూడెం తండా తదితర పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నందున తిరిగి పున ప్రారంభించాలని మండల విద్యాధికారి తరిరాములు తెలిపారు. పైన తెలిపిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేపు వెళ్లి పాఠశాలను శుభ్రం చేసుకొని ప్రతిరోజు గ్రామస్తులను కలుస్తూ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ పూర్తి చేయాలని తెలిపారు.
గ్రామంలో ఐదు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు.. ఎక్కడ చదువుతున్నారు. వివరాలన్నీ నమోదుచేయాలని తెలిపారు. ప్రతి స్కూల్ యందు అయిదుగురు, అంతకంటే ఎక్కువ మందిని విద్యార్థులను చేర్చుకొని పాఠశాలను పున ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి విద్యార్థులను పాఠశాలలో చేర్చడానికి గ్రామస్తుల, విద్యావంతుల, ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.
మూత బడిన పాఠశాలలను తిరిగి తెరిపించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES