Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూతపడిన పాఠశాలలను మళ్ళీ తెరిపించాలి

మూతపడిన పాఠశాలలను మళ్ళీ తెరిపించాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
గ్రామస్తుల సహకారంతో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించాలని మండల విద్యాధికారి తరిరాము తెలిపారు. బుధవారం మండలం లోనిఅప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీస్కూల్,కేజీబీవీ,ఎయిడెడ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. పాఠశాలలు సక్రమంగా నిర్వహించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.  ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు, ఎఫ్ఆర్ ఎస్ అటెండెన్స్ పరిశీలించాలని ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని సమర్థవంతంగా,మెనూ ప్రకారం పాటించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం కంట్రోల్మెంట్ తక్కువ ఉన్న పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ శేషు, మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మీ, శ్రీనివాస్, సుదర్శన్, ఉపాధ్యాయులు పాపిరెడ్డి కృష్ణ, దుర్గాప్రసాద్, గోలికృష్ణ సిఆర్పిలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -