శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్‌లో ఆదివారం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. రియాసీలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఐదుగురు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాంబన్ తాలూకాలోని రాజ్‌గర్‌లో భారీ వర్షం కురవడంతో వరదలు వచ్చి పడ్డాయి. నలుగురు గ్రామస్థులు చనిపోగా మరి కొందరి ఆచూకీ తెలియడం లేదు. రెండు ఇండ్లు, ఓ పాఠశాల భవనం వరద నీటిలో కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. ఐదుగురు వ్యక్తుల జాడ తెలియడం లేదని, వారి కోసం ఆగాలిస్తున్నామని అధికారులు చెప్పారు. వరద ప్రవాహం కారణంగా ఆస్తి నష్టం కూడా సంభవించిందని తెలిపారు. మరో ఘటనలో రియాసీ జిల్లాలోని మాహోర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బద్దర్ గ్రామంలో ఒక ఇల్లు నామరూపాలు లేకుండా పోయింది. ఈ సంఘటనలో ఏడుగురు విగతజీవులయ్యారు. వీరిలో దంపతులు, వారి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారంతా 12 సంవత్సరాల లోపు వయసు వారే. ఇదిలావుండగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలను వరుసగా ఐదో రోజు కూడా నిలిపివేశారు. కొండచరియలు విరిగిపడడంతో ఉధంపూర్, బనిహాల్ మధ్య అనేక చోట్ల రోడ్డు దెబ్బతింది. గత రెండు వారాలుగా జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లు నమోదవుతున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కాలంలో 115 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఎక్కువ మంది యాత్రికులే.
పంజాబ్‌లో ముంచెత్తిన వరదలు.. 23 మంది మృతి, వెయ్యి గ్రామాలు మునక
పంజాబ్‌లో భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల్లో కనీసం 23 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. వరద ప్రభావిత జిల్లాల నుంచి సుమారు 16వేల మందిని రక్షించారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. నీటి మునిగిన ప్రాంతాలకు రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తోంది. పఠాన్‌కోట్‌లో 8 మంది, హౌషియార్ పూర్‌లో ఏడు, రూప్‌నగర్, బార్నాలాలో మూడేసి మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని రావి, బియాస్, సట్లజ్ నదులు ఉప్పొంగి ప్రవాహి స్తున్నాయి. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం భవంత్ మాన్ సింగ్ ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. గురుదాస్‌పుర్, పఠాన్‌కోట్, అమత్‌సర్, తరన్ తారన్, కపుర్తలా, హౌషియాపూర్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా పట్టణాల్లో ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షిం చేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్మీ, బీఎస్‌ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. రావి నది నుంచి సుమారు 14.11 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో డ్యామేజ్ జరిగింది.
జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES