నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయములో గత మూడు రోజులుగా జరిగిన తెలంగాణ జవహర్ నవోదయ పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలు అంగ రంగ వైభవం గా శుక్రవారం ముగిశాయి. తెలంగాణలోని 9 జిల్లాల నుండి 21 ఈవెంట్లలో పాల్గొన్న 114 మందిలో 68 మంది అబ్బాయిలు 46 మంది అమ్మాయిలు పోటీలలో పాల్గొన్నారు.ఇందులో మూడు జంపులు, నాలుగు త్రోలు, నాలుగు హర్డెల్స్ ,రెండు వా క్స్ ,8 రన్నింగ్ ఈవెంట్స్ లో పోటీలు జరిగాయి.ఈసందర్బంగా ఇంచార్జి ప్రిన్సిపాల్ కె.శంకర్ మాట్లాడుతూ ఈ క్లస్టర్ నుండి పాల్గొని విజయం సాధించిన 114 మంది విద్యార్థిని విద్యార్థులలో 25 మంది అబ్బాయిలు 25 మంది అమ్మాయిలు జవహర్ నవోదయ విద్యాలయము ముందరాగి, గదక్ జిల్లా ,కర్ణాటకలో పాల్గొనడానికి ఈనెల 27వ తేదీన బయలుదేరబోతున్నారని తెలిపారు.
అక్కడ కూడా వారు వారి సత్తాను చాటి నేషనల్ స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నామన్నారు.వీరికి ఉత్తమ శిక్షణ నిచ్చిన వ్యాయామ శిక్షకులు కృతజ్ఞతలు తెలుపు తున్నామన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడానికి విద్యాలయ సిబ్బంది ఎంతో సహకరించారని సిబ్బందిని అందరినీ కొనియాడారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణను పాటిస్తూ చక్కటి ప్రదర్శనను ఇవ్వడము ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం ఎంతో శుభ విశేషముగా భావించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడి నుండి వేర్వేరు ఆటలకు గాను వెళ్లినటువంటి విద్యార్థిని విద్యార్థులు జేఎన్వి ఆదిలాబాద్,ఖమ్మం,పాలేరు
లలో కూడా నల్గొండ విద్యార్థులు జయకేతనం ఎగురవేసి అందరికంటే ఎక్కువ స్థానాలు వీరే సంపాదించడం మన విద్యాలయం వ్యాయామశిక్షకుల గొప్పతనానికి సంకేతంగా మనం భావించవచ్చుని అన్నారు.
ఆదిలాబాద్ లో జరిగిన బాల్ గేమ్స్ లో, క్లస్టర్లో పాల్గొనడానికి చలకుర్తి క్యాంపు నుండి 13 మంది విద్యార్థులు వెళ్ళగా అందులో పది మంది విద్యార్థులు రీజనల్ కు సెలెక్ట్ కావడం విశేషమని తెలిపారు. అంతేకాకుండా ఖమ్మం క్లస్టర్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన 50 మందిలో 32 మంది విద్యార్థులు రీజనల్ కు సెలెక్ట్ కావడం గొప్ప విషయం అని,చలకుర్తి క్యాంపులో జరిగిన క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్ మీట్ లో కూడా దాదాపుగా ఎక్కువ మంది విద్యార్థులు చలకుర్తి క్యాంపు వాళ్లే సెలెక్ట్ కావడం కూడా మరో విశేషంగా భావించవచ్చుని అన్నారు.ఈ కార్యక్రమం లోస్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ దగ్గుపాటి విమల,పీఈటీలు రాధ, లెనిన్ బాబు,మురళీ వెంకట్రాంరెడ్డి,శోభరాణి,
ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా ముగిసిన క్లస్టర్ లెవెల్అత్లెటిక్ మీట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES