– ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించి పనివేళల మార్పునకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎంను ఆయన కలిశారు. విద్యారంగ సమస్యలపై చర్చించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను అందించాలని కోరారు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పరస్పర బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులను ఉత్తర్వులను జారీ చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని తెలిపారు. విద్యారంగ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల పనివేళల మార్పునకు సీఎం అంగీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES