Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంలండన్ లో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు

లండన్ లో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం లండన్‌లో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన, నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వారికి క్షుణ్ణంగా వివరించారు.

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు’కు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను, పెట్టుబడిదారులకు అందిస్తున్న సహకారాన్ని ఆయన తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -