నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉన్న తన నివాసంలో ఉంచారు. ఆయన భౌతికగాయాన్ని సందర్శించి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందనీ, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని వారు గుర్తు చేసుకున్నారు.
మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మృతికి సీఎం సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES