Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీర్ల అయిలయ్యను అభినందించిన సీఎం

బీర్ల అయిలయ్యను అభినందించిన సీఎం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్  
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా మరియు జనగామ మున్సిపల్ కేంద్రాలలో పదవి బాధ్యతలు చేపట్టడంలో కీలకంగా పని చేసినందుకు అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల చైర్మన్,వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డిగారికి కానుకగా ఇస్తామన్న మాట మేరకు రేవంత్ రెడ్డి కలసి పలు అంశాలను చర్చించారు.

ఆ తర్వాత జనగామ మున్సిపాలిటీలో బీర్ల ఐలయ్య కి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పిన సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ని ఎంపిక చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం తో పాటు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని వాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ జనగామ పార్టీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్థిక  శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -