Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేడుకలా సీఎం కప్పు 2026 పోటీలు

వేడుకలా సీఎం కప్పు 2026 పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సిఎం కప్ 2026 మండలస్థాయి ఆటల పోటీలు శుక్రవారం మండల విద్యాధికారి తరిరాము ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి మానే ఉమాదేవి, పీఢీరాజకుమార్,స్థానిక సర్పంచ్ ఐత బోయిన వెంకటయ్య ప్రారంభిచారు. మండల స్థాయిలో కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, యోగ, చెస్, కరాటే వంటి క్రీడలు నిర్వహించారు.

జూనియర్, సబ్ జూనియర్, బాలురు, బాలికలు, అండర్-14, అండర్-16, అండర్-20, విభాగంలో క్రీడలు నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేసిన క్రీడాకారులు ఉమ్మడి జిల్లా స్తాయిలో జరిగే పోటీలకు అర్హత సాదించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్సై ప్రసాద్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ విమల, సంగారం సర్పంచ్ ఈసం రమేష్, ఫిజికల్ డైరెక్టర్ శివరాం, శోభారాణి, మురళి, లావణ్య, వివిధ గ్రామపంచాయతీ  క్రీడాకారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -