Wednesday, January 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సీఎం కప్ పోటీలు ప్రారంభం..

సీఎం కప్ పోటీలు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంతో పాటు స్వర్ణ ,జామ్, చించోలి(బి)క్లస్టర్ లో క్రీడా పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హాది ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఎంఇఓ మహేందర్ తోపాటు ఆయా గ్రామాల సర్పంచులతో కలసి సీఎం కప్ 2026, కబడ్డీ, క్రికిట్, వాలీబాల్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు యూనిఫామ్, క్రికెట్ కిట్లు, వాలీబాల్స్ ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్రీడలను కేవలం పోటీలుగా కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, జట్టు భావన పెంపొందుతాయని, గ్రామ పంచాయతీ తరఫున  క్రీడా సౌకర్యాల మెరుగుదలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

విద్యతో పాటు క్రీడలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మండల జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ఆలయ గ్రామాల క్రీడాకారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -