Friday, January 30, 2026
E-PAPER
Homeఖమ్మంఈనెల 17 నుంచి సీఎం కప్ పోటీలు 

ఈనెల 17 నుంచి సీఎం కప్ పోటీలు 

- Advertisement -

డి వై ఎస్ ఓ సునీల్ రెడ్డి 
నవతెలంగాణ – బోనకల్ 

ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2025 2026 సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయని డి వై ఎస్ ఓ సునీల్ రెడ్డి తెలిపారు. 2025 – 2026 సీఎం కప్ పోటీలలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ బస్టాండ్ బస్టాండ్ సెంటర్లో జ్యోతిని సునీల్ రెడ్డి ఎంపీడీవో రురావత్ రమాదేవి మండల విద్యాశాఖ అధికారి గ్రామాల పుల్లయ్య ఎస్సై పొదిలి వెంకన్న లాంచనంగా వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కంభం బస్టాండ్ సెంటర్ నుంచి బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం వరకు వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ఆటలు పోటీలు జరుగుతాయని తెలిపారు.

మండల స్థాయిలో 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి మూడు నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. పోటి ఆటలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో జరుగుతాయని తెలిపారు. ఆహ్లాదకర పోటీలు చిన్నారులతో జరుగుతాయని తెలిపారు. పారా గేమ్స్ ఓపెన్ కేటగిరిలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు గ్రామ పంచాయతి కార్యాలయాలలో తెలుసుకోవచ్చు నని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పీడీలు ఇమ్మడిశెట్టి నారాయణ, కనకరాజు సత్యానందం, సయ్యద్ నవీద్ పాషా, వివిధ పాఠశాలల పిఈటిలు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -