Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ ఆటల పోటీలు...

తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ ఆటల పోటీలు…

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సీఎం కప్-2025 పేరుతొ క్రీడాకారులకు పోటీలను ఫిబ్రవరి 05 నుండి 07వరకు జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల విద్యాధికారి తిరుపతయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రకటనలో తెలియజేస్తు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు.వాలీబాల్ ZPHS జుక్కల్, ఫిబ్రవరి 05 కామారెడ్డి జిల్లా నాడు ఉదయం 09.00 గంటలకు, కబడ్డి & ఖోఖో జెడ్ పి హెచ్ స్ జుక్కల్, కామారెడ్డి జిల్లా తేదీ ఫిబ్రవరి 06 ఉదయం 09.00 గంటలకు. 3. అథ్లెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ పెద్ద  ఎడ్గి, జుక్కల్ మండలం తేదీ ఫిబ్రవరి 07, నాడు ఉదయం 09:00 గంటలకు  జుక్కల్ నియోజకవర్గ స్థాయి లో ఎంపిక చేసిన క్రీడాకారులను ఈ నెల 09 నుండి 12 వరకు జరిగే సీఎం కప్-2025 కామారెడ్డి జిల్లా స్థాయి పోటీలకు పంపబడును అని రెవెన్యూ డివిజనల్ అధికారి, బాన్సువాడ గారు ప్రత్రిక పకటన ద్వారా తెలియజేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -