నవతెలంగాణ – కాటారం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 04న కాటారం మండల స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలను కాటారం మండల కేంద్రంలో యంపీడీఓ అడ్డురి బాబు, యం ఈ ఓ శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కాటారం మండల పరిధిలోని కాటారం, చింతకాని, రేగులగూడెం క్లస్టర్లకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. అన్ని క్లస్టర్లకు చెందిన క్రీడాకారులు బుధవారం ఉదయం 9:30 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా కాటారం క్లస్టర్ ఇన్‌చార్జ్ గురుసింగ విజయలక్ష్మి (PD), చింతకాని క్లస్టర్ ఇన్‌చార్జ్ రమేష్ (PD), రేగులగూడెం క్లస్టర్ ఇన్‌చార్జ్ మాజిమ్ (PD) లు క్రీడాకారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ఈ క్రీడా పోటీలకు వేదికగా ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్, కాటారం ను నిర్ణయించినట్లు తెలిపారు. క్రీడాకారులు సమయపాలన పాటించి క్రీడా సామగ్రితో హాజరుకావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



