నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ – 2025 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి వీణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఫిబ్రవరి 4 నుండి 5 వరకు కామారెడ్డి నియోజకవర్గ స్థాయిలో జరుగనున్నాయనీ, ఫిబ్రవరి 4 న ఉదయం 9 గంటలకు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు నిర్వహించబడతాయన్నారు.
ఫిబ్రవరి 5 న ఉదయం 9 గంటలకు కామారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ (బాయ్స్) పాఠశాలలో కబడ్డీ, ఖోఖో పోటీలు జరుగుతాయనీ, నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 9 నుండి 12 వరకు జరిగే సీఎం కప్ – 2026 జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని ఆర్‌డీవో తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీలలో పాల్గొనాలని కోరారు.



