Friday, February 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎంకప్ క్రీడలు.. ఖోఖో పోటీలు ప్రారంభం

సీఎంకప్ క్రీడలు.. ఖోఖో పోటీలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
సీఎం కప్ పోటీలలో భాగంగా శుక్రవారం ఎంఈఓ తిరుపతయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీలలో విద్యార్థుల ఉత్తమ ఆటతీరుకు సహకరించిన పీఈటీల కృషి ఎంతో విలువైందన్నారు. పోటీలలో గెలుపొందిన అభ్యర్థులకు డివిజన్, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఆడేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీడీవో శ్రీనివాస్, జుక్కల్ క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం హనుమంత రెడ్డి ఖండేబల్లూర్ క్లస్టర్ కాంప్లెక్స్ సీఆర్పీలు భీమ్రావు, భీమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -