ఆరంభ కార్యక్రమానికి సీఎం రేవంత్‌కు ఆహ్వానం
నీలమణి యాప్ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్
సీఎం కప్ 2026 రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 20 నుంచి ఆరంభం కానున్నాయి. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు 44 క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు. హైదరాబాద్‌లోని పలు స్టేడియాల్లో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే ఆరంభ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, శాట్జ్ ఎండీ సోనీబాలా దేవిలు సీఎంను కలిసి ఆహ్వాన ప్రతి అందజేశారు. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సీఎం కప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సమాచారం అందిచేందుకు రూపొందించిన నీలమణి యాప్‌ను సచివాలయంలోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు.



