మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైల్వే ప్రాజెక్టులపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రెండు ప్రధాన రైల్వే లైన్లను విస్మరించారని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనేది ఏపీ విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌కు రైలులో వెళ్ళాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మళ్లీ ఆదిలాబాద్‌కు రావాలని తెలిపారు. నిజాం కాలం నాటి ఆ రైల్వే లైనే ఇప్పటికీ రాకపోకలు కొనసాగుతున్నాయని వివరించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే సర్వే,డీపీఆర్‌ను రెడీ చేయించామని గుర్తు చేశారు. ఆ రైల్వే లైన్‌లో కొత్త లింకులు కలిపితే ఉత్తర తెలంగాణ పది జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ వస్తుందని తెలిపారు. ఆ రెండు రైల్వే లైన్లపై సీఎం దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయమై సీఎంతోపాటు సీఎస్, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాస్తామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో టి రవీందర్‌రావు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాదరి బాలమల్లు, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
ప్రధాన రైల్వే లైన్లను విస్మరించిన సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES