– టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ చూపి వాటిని పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. సీఎం చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
కానీ ఆర్థికేతర సమస్యలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారం కోసం ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు. సీపీఎస్, యూపీఎస్‌ను రద్దు చేయాలనీ, ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని సూచించారు. పీఆర్సీని అమలు చేయాలన్నారు. నగదు రహిత వైద్య చికిత్సను అందించాలనీ, ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్‌ను తీసుకోవాలని కోరారు. 317 జీవో బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పారు. బీఎడ్ అర్హత ఉన్న ఎస్జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులను కల్పించాలని అన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయాలన్నారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన చిక్కుల్లేకుండా విద్యాశాఖ ఉత్తర్వు లను జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావలి అశోక్‌కుమార్, సుంకిశాల ప్రభాకర్‌రావు, గోవర్ధన్, కోలరాజు నాయక్, మహేందర్‌రాజు, రణధీర్‌తో పాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
టీచర్ల సమస్యలపై సీఎం చొరవ చూపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES