- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టే రోజు దీనికి వ్యతిరేకంగా మమతా కూడా కోల్‌కతా వీధుల్లో నిరసన చేపట్టనున్నారు. నవంబర్ 4న కోల్‌కతాలోని రెడ్ రోడ్ నుండి జోరాసాంకో వరకు జరిగే నిరసన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ మమతాతోపాటు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొననున్నారు.కాగా, ఎన్నికల సంఘం చేపట్టే ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.
- Advertisement -



