Friday, March 27, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభకు వెళ్తున్నా.. సీఎం నితీశ్ కుమార్ ప్రకటన

రాజ్యసభకు వెళ్తున్నా.. సీఎం నితీశ్ కుమార్ ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన ఎక్స్‌ పోస్టులో ధ్రువీకరించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయనున్నారని స్పష్టమవుతోంది. ‘రెండు దశాబ్దాలుగా మీరు నన్ను నమ్మి నాకు మద్దతు ఇచ్చారు. అంకితభావంతో నా విధుల్ని నిర్వర్తించాను. మీ మద్దతు, నమ్మకం వల్లే బిహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తాను’’ అని తన పోస్టులో నీతీశ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌కు కొత్త సీఎం రానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -