- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: కర్నూలులోని టెస్టింగ్ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని ఆయన అన్నారు.
కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్)లో యూఏవీ-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (యూఎల్‌పీజీఎం-V3) పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు.
- Advertisement -