Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం నివాళి

బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం నివాళి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతి సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషిని సీఎం కొనియాడారు. కుల వివక్ష, అంటరానితనానికి ఆయన వ్యతిరేకంగా పోరాడారనీ, దళితుల హక్కుల కోసం జీవితాంతం పనిచేశారని గుర్తు చేశారు. బాబూజీ స్పూర్తితో రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. సామాజిక న్యాయం కోసం కృషి చేశారు.

మంత్రి వివేక్‌ వెంకటస్వామి నివాళి
బాబూ జగ్జీవన్‌ రామ్‌ సామాజిక న్యాయం కోసం కృషి చేశారని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్‌ ఏ హోదాలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసి, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని గుర్తు చేశారు. జగ్జీవన్‌రామ్‌ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే మన దేశం 1971 యుద్ధంలో విజయం సాధించిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -