Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలక్ష్మీనర్సమ్మకు సీఎం నివాళి

లక్ష్మీనర్సమ్మకు సీఎం నివాళి

- Advertisement -

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌.భూపతిరెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీనర్సమ్మ గత నెల 29న కన్నుమూశారు. శుక్రవారం నిజామాబాద్‌లో ద్వాదశ దినకర్మ నిర్వహించగా.. సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎంతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధన్పాల్‌ సూర్యనారాయణ, రాకేష్‌ రెడ్డి, అధికారులు, ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు నివాళి అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -