Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంకు హార్వర్డ్‌ నుంచి ఆహ్వానం

సీఎంకు హార్వర్డ్‌ నుంచి ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. అక్కడ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొనాల్సిందిగా కోరారు. మార్చి 27న హార్వర్డ్‌ స్కూల్‌ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్‌ యూనివర్సిటీలో సమకాలీన రాజకీయాలు అంశంపై తరగతులకు హాజరైన విషయం తెలిసిందే. అప్పట్లోనే యూనివర్సిటీ ప్రతినిధులు ఈ సింపోజియంకు హాజరుకావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా హాజరవుతానని రేవంత్‌రెడ్డి చెప్పిఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హర్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానాన్ని పంపింది. ఈ సింపోజియంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -