- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన మాడుగుల హుస్సేన్, కడారి తిరుపతయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి భార్యలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక్కొక్కరికి రూ.60 వేల చెక్కులను గురువారం వారి కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాలరాజు అందించారు. అలాగే జేపల్లి గ్రామ పంచాయితీలోని దొంగల గుట్ట తండాకు చెందిన రత్లవత్ నవీన్ కి సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60 వేల చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రాథోడ్ అందించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, శ్రీను, సైదులు, మాధవరెడ్డి, చంద్రు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -