- Advertisement -
నవ తెలంగాణ:రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక యాదవ్, గ్రామ అధ్యక్షులు చీరడి రవి ల ఆధ్వర్యంలో సీఎం సహాయనిధ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చొరవతో, నిరుపేదల ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం సాయి నిధి చెక్కులను అందజేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూర్గం గ్రామ తరపున వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధ సాయిలు శ్రీకాంత్ అబ్బోల్లా, నీ రెడీ గంగాధర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -