- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని జగదాంబ తండా కు చెందిన గంగావత్ మౌనిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, రూ.50 వేల విలువ గల చెక్కును ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశం మేరకు ఆదివారం మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డి నాయక్, విట్టల్ నాయక్, చందర్ నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



