- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన సుద్దాల బాల్ నర్సు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తిం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గాండ్ర అంజయ్యతో కలిసి బాదిత కుటుంబానికి రూ.60 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజమణి, నాయకులు రగోతం రెడ్డి, బండి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



