- Advertisement -
జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
పేద ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతే, వారికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి సీఎం సహాయ నిధి నుండి ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, ఆదివారం మండలంలోని గొడుగు మర్రి తండాకు చెందిన మానవ సరోజ రూ 60000 , రెడ్డిపేట కు చెందిన పట్ల లత రూ 60000 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రగోతం రెడ్డి, రెడ్డి నాయక్, పరమేష్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



