- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జన్నారం మండలంలోని తపాలాపూర్, జన్నారం ఫోన్కాల్ తదితర గ్రామాల్లోని సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. జన్నారం మండలంలో మొత్తం 90 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బాసటగా నిలవాలన్నారు.
- Advertisement -