నవతెలంగాణ – జోగులంబ గద్వాల : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 17 మంది లబ్ధిదారులకు రూ.5.28 లక్షల చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు మాజీ ఎంపీపీ విజయ్, పిఎసిఎస్ ఛైర్మన్ వెంకటేష్, సీనియర్ నాయకులు రామకృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు ఆనంద్ గౌడు, రంగస్వామి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బజారి, నాయకులు ఆలూరు రామయ్య శెట్టి, రామకృష్ణ నాయుడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.