Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుసీఎం సహాయ నిధి పేదలకు అండ..

సీఎం సహాయ నిధి పేదలకు అండ..

- Advertisement -


నవతెలంగాణ వెల్దండ
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంతో పేదలకు అండగా ఉంటుందని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ అన్నారు. మంగళవారం వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ తుంకిబండ తండాకు చెందిన మూడవత్ కేశ్య పేరిట మంజూరైన రూ.21 వేల సీఎం సహాయనిధి చెక్కును మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల కృష్ణ లబ్ధిదారునికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో గ్రామపంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమం లో గుద్దటి లక్ష్మారెడ్డి, నెంట శ్రీను, శివదనుసు, మాడ్గుల వెంకటయ్య, మోత్య నాయక్, శివరాం నాయక్, సుధాకర్, తిరుపతి నాయక్, అనిల్, రాజేష్ నాయక్, ప్రవీణ్ నాయక్, ప్రశాంత్, సంతోష్ నాయక్, ఉదేయ్ నాయక్, వినోద్, జంగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -