నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండల కేంద్రంలోని 9 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల 53 వేల 500 సీఎంఆర్ చెక్కులను బుధవారం అందించడం జరిగింది. ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు,ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు,సురేష్,మహేష్,అనిల్ గౌడ్, సాయిబాబా,శ్యామ్ రాజ్, దినేష్, శ్రీకాంత్, భూషణ్, శ్రీను,ప్రసాద్,ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.
పేదవారికి అండగా సీఎం సహాయనిధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES