Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్, ఎమ్మెల్యే తోట చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం రేవంత్, ఎమ్మెల్యే తోట చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు 42% అమలు చేయడం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ చిత్రపటాలకు బీసీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ చేయడం వలన బడుగు బలహీన వర్గాలైన బీసీలకు న్యాయం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, విండో చైర్మన్ శివానంద్, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ పటేల్, నాయకులు బొంపెల్లి రాజులు, అనిల్ సెట్, గంగాధర్ బొంపెల్లి వార్, విజయ్ తదితరులు హాజరు కావడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -