రేపటి నుంచి కెన్నడి స్కూల్‌లో క్లాసులకు హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎప్పుడూ పరిపాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా వచ్చారు. ఆదివారం నుంచి అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ క్యాంపస్‌లో జరిగే ప్రత్యేక తరగతులకు ఆయన హాజరు కానున్నారు. ఇందుకోసం సీఎం దావోస్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లిన సంగతి విదితమే. కాగా కెన్నడీ స్కూల్‌లో ఈనెల 30 వరకు స్పెషల్ క్లాసులు కొనసాగనున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహిస్తున్న ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా ఇప్పుడు క్లాసులకు హాజరవుతున్నారు. కోర్సులో భాగంగా వాస్తవ ప్రపంచంలోని సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనటంపై ప్రధానంగా దష్టి సారిస్తారు. ప్రత్యేక తరగతులు పూర్తయిన తర్వాత అక్కడి యూనివర్శిటీ నుంచి సీఎం సర్టిఫికెట్ అందుకుంటారు. అనంతరం ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
స్టూడెంట్‌గా సీఎం రేవంత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



