Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయూత్‌ కాంగ్రెస్‌ నేత పెండ్లికి హాజరైన సీఎం రేవంత్‌

యూత్‌ కాంగ్రెస్‌ నేత పెండ్లికి హాజరైన సీఎం రేవంత్‌

- Advertisement -

నవతెలంగాణ-కొడంగల్‌
వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని చెన్నకేశవ ఫంక్షన్‌ హాల్‌లో యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్‌- మమత వివాహం ఆదివారం జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌ వచ్చిన మొదటి నుంచి రెడ్డి శ్రీనివాస్‌ ఆయన వెన్నంటే ఉన్నారు. కృష్ట, సుఖాలలో పాలుపంచుకున్నారు. రేవంత్‌రెడ్డి విజయంలోనూ కీలక భూమిక పోషించారు. సీఎంకి నమ్మినబంటుగా ఉంటూ.. యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. శ్రీనివాస్‌ అంకితభావం, పట్టుదల, పనికోసం చేసిన తీరును మరచిపోనని చెప్పిన రేవంత్‌రెడ్డి శ్రీనివాస్‌ వివాహానికి హాజరుకావడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అంతకుముందు సీఎంకు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహమేహ్ర, ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుయ్యాని మనోహర్‌రెడ్డి, రాజ్‌ ఠాకూర్‌తోపాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -