నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలనీ, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సీఎం అభిలషించారు. గత ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం అన్నారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



