- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సర్వ భ్రష్ట ప్రభుత్వానికి నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ‘‘శాసనసభలో సీఎం మాట్లాడే భాష సరిగా లేదు. అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునేందుకే తిడుతున్నారు. వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేరు. ముఖ్యమంత్రికి నీటిపారుదల రంగంపై కనీస అవగాహన లేదు. దోచుకోవడం, దాచుకోవడం తప్పా ఏమీ తెలియదు. తెలంగాణ కోసం రేవంత్‌రెడ్డి ప్రాణాలు ఇస్తానంటున్నారు. ఇప్పటివరకు తీసిన ప్రాణాలు చాలు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
- Advertisement -



