- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని మల్కాజిగిరి క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రధానంగా 38 హంగ్ మున్సిపాలిటీలపై చర్చ జరగనుంది. వీటిలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునేలా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 20కిపైగా హంగ్ మున్సిపాలిటీలు ‘హస్త’గతం అవుతాయని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ సమావేశానికి పలువురు సీనియర్ నేతలూ హాజరయ్యారు.
- Advertisement -



