- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం ఆదర్శనీయమని సీఎం పేర్కొన్నారు.
- Advertisement -



